Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'దేవర' పోస్టర్లపై జన జాగరణ సమితి పోస్టర్లు

Vizag Steel Plant posters on Devara movie Posters
Advertisement
  • రేపు విడుదలవుతున్న జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'
  • 'దేవర'ను తాకిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసన
  • 'దేవర' సినిమా పోస్టర్లపై 'సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్' అనే నినాదాలు 
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'దేవర' రేపు (సెప్టెంబరు 27) ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. మరోవైపు ఈ చిత్రాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం సెగ తాకింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతునివ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. 'దేవర' సినిమా పోస్టర్లపై 'సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్', 'విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు' అనే నినాదాలను జన జాగరణ సమితి నేతలు అతికించారు.

స్టీల్ ప్లాంట్ నినాదాలను సినిమా పోస్టర్ పై అతికిస్తే... తమ పోరాటం మరింతగా ప్రజల్లోకి వెళుతుందనేది జన జాగరణ సమితి నేతల ఆలోచన. మరి పోస్టర్ల వ్యవహారంపై తారక్ కానీ, చిత్ర యూనిట్ సభ్యులు కానీ స్పందిస్తారేమో వేచి చూడాలి. 

'దేవర' సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించింది. కొరటాల శివ తెరక్కించిన ఈ చిత్రానికి నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ను రాబట్టి అంచనాలను అమాంతం పెంచేసింది.
Advertisement
Advertisement
Devara Movie
Tollywood
Vizag Steel Plant

More Telugu News